Share News

స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి

ABN , Publish Date - Nov 08 , 2024 | 10:23 PM

ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణ, చంద్రకళతో కలిసి సమావేశం నిర్వహించారు. ఎన్నికల అధికారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు.

స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణ, చంద్రకళతో కలిసి సమావేశం నిర్వహించారు. ఎన్నికల అధికారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. నూతన ఓటరు నమోదుకు ఫారం 6 ద్వారా దరఖాస్తులు స్వీకరించాలన్నారు. సవరణలో భాగంగా పేర్లు, చిరునామా, ఇతర తప్పుల సవరణకు అందిన దరఖాస్తులను పరిష్కరించాలన్నారు.

మరణించిన వారి వివరాలను జాబితా నుంచి తొలగించేందుకు నోటీసులు జారీ చేసి తొలగించాలన్నారు. పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా ముఖ్యమని తెలిపారు. అర్హులైన వారు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం అనంతరం తుది ఓటరు జాబితా ప్రకటిస్తామన్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో ఓటరు ప్రత్యేక నమోదు చేపట్టడం జరుగుతుందని, అర్ములైన వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 10:23 PM