Share News

జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

ABN , Publish Date - Sep 01 , 2024 | 10:28 PM

జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఎం(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన శ్రీరాంపూర్‌లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. గ్రామాలు, తండాల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని, వారికి ప్రభుత్వ వైద్యం అందడం లేదన్నారు.

జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

శ్రీరాంపూర్‌, సెప్టెంబరు 1: జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఎం(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన శ్రీరాంపూర్‌లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. గ్రామాలు, తండాల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని, వారికి ప్రభుత్వ వైద్యం అందడం లేదన్నారు. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే టెస్టులు, వైద్యం పేరుతో లక్షల రూపాయలు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, మందు లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. సుంకె రవి, గోమాస ప్రకాష్‌, రంజిత్‌ కుమార్‌, బోడెంకి చందు, దాగం రాజారాం పాల్గొన్నారు.

అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తపడాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 1: ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడాలని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో 24 గంటల పాటు సమా చారాన్ని చేరవేయడానికి సెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. వరదలు ఉన్న గ్రామాల్లో ప్రసవానికి సిద్ధంగా ఉన్న వారిని సిబ్బంది ఆసుపత్రికి తీసు కురావాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు అందుబాటులో ఉంటాయని అవసరం అయితే 9177084068లో సంప్రదించాలన్నారు.

Updated Date - Sep 01 , 2024 | 10:28 PM