Share News

పత్తికి మద్దతు ధర చెల్లించాలి

ABN , Publish Date - Dec 27 , 2024 | 10:32 PM

మండలంలోని కిష్టంపేట గ్రామంలోని వరలక్ష్మీ జిన్నింగు మిల్లు ఎదుట పత్తికి మద్దతు ధర చెల్లించాలని రైతులు శుక్రవారం చెన్నూరు-మం చిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహిం చారు.

పత్తికి మద్దతు ధర చెల్లించాలి

చెన్నూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కిష్టంపేట గ్రామంలోని వరలక్ష్మీ జిన్నింగు మిల్లు ఎదుట పత్తికి మద్దతు ధర చెల్లించాలని రైతులు శుక్రవారం చెన్నూరు-మం చిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సీపీఐలో మంగళవారం వరకు పత్తి క్వింటాల్‌కు రూ.7520 ఉండగా, ప్రస్తుతం వంద రూపా యలు తగ్గించారని, దీంతో తాము నష్టపోతా మని పేర్కొన్నారు.

తగ్గించిన ధరలను పెంచా లని డిమాండ్‌ చేశారు. సుమారు 2 గంటల పాటు ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీ సులు ధర్నా వద్దకు చేరుకున్నారు. సీఐ రవీం దర్‌, సీపీవోలు రైతులతో మాట్లాడి నచ్చజెప్ప డంతో ధర్నాను విరమించారు.

Updated Date - Dec 27 , 2024 | 10:32 PM