ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ సిద్ధం చేయాలి
ABN , Publish Date - Oct 03 , 2024 | 10:45 PM
ఖరీప్ ధాన్యం కొనుగోలుకు కార్యచరణ సిద్ధం చేయాలని ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గురువారం హైద్రాబా ద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అద నపు కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహిం చారు. సన్నరకం వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామ న్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 3: ఖరీప్ ధాన్యం కొనుగోలుకు కార్యచరణ సిద్ధం చేయాలని ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గురువారం హైద్రాబా ద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అద నపు కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహిం చారు. సన్నరకం వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామ న్నారు. టార్పాలిన్లు, గన్నీ సంచులను సిద్ధంగా ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ల ఖాతాల్లో నగదు జమచేయాలన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ రూపొందించాలని తెలి పారు. డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఆర్డీవో కిషన్, జిల్లా పౌరసరఫరా అధికారి బ్రహ్మరావు, మేనేజర్ శ్రీకళ, వ్యవసాయదికారి కల్పన, సంజీవరెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.
ధ్రువపత్రాల పరిశీలన
డీఎస్సీ 2024 మెరిట్ లిస్టులో స్ధానం కలిగి ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కార్మెల్ ఉన్నత పాఠశాలలో డీఈవో యాదయ్యతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మెరిట్ లిస్టులో ఉన్న 715 మంది అభ్యర్ధుల ధ్రువపత్రాల ను పరిశీలించాలన్నారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరిం చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రికార్డులు సరిచూసి క్షేత్రస్ధాయిలో ప్లాట్ల బౌగళికస్థితిని పరిశలించి త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూములు చెరువు, వాగుల భూముల రికార్డులను పరిశీలించాలని, వీటి పరిధిలో ప్లాట్లు ఉంటే దరఖాస్తులను తిరస్కరించి దరఖాస్తు దారునికి సమాచారం అందించాలన్నారు. డీపీవో వెంకటేశ్వర్ రావు, డీటీసీపీ సంపత్, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.