Share News

ఏజెన్సీ బంద్‌ విజయవంతం

ABN , Publish Date - Aug 27 , 2024 | 10:44 PM

ఏజెన్సీ ప్రాంత సమస్యలను పరిష్కరించా లని, ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని మంగళవారం చేపట్టిన ఏజెన్సీ బంద్‌ పిలుపు మండలంలో విజయవంతమైంది. నాయకపోడ్‌ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ ప్రభుత్వం వలస లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి వెంటనే తొలగించాలని, జీవో నెంబర్‌ 3ని కొనసాగించి ఐటీడీఏలో ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఏజెన్సీ బంద్‌ విజయవంతం
rastaroko

కాసిపేట, ఆగస్టు 27: ఏజెన్సీ ప్రాంత సమస్యలను పరిష్కరించా లని, ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని మంగళవారం చేపట్టిన ఏజెన్సీ బంద్‌ పిలుపు మండలంలో విజయవంతమైంది. నాయకపోడ్‌ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ ప్రభుత్వం వలస లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి వెంటనే తొలగించాలని, జీవో నెంబర్‌ 3ని కొనసాగించి ఐటీడీఏలో ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ పోలీసు బెటాలి యన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. బంద్‌కు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీ సంఘాల నాయకులు ఆత్రం జంగు, సండ్ర భూమయ్య, సిడాం శంకర్‌, మడావి తరుణ్‌, రజనీ, ఆత్రం వంశీ, సిడాం హన్మంతు, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

దండేపల్లి: ఎస్టీ జాబితాలో నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బంద్‌లో భాగంగా దండేపల్లి, ముత్యంపేటలో ఆదివాసి సంఘాల నాయకులు రాస్తారోకో చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ఆదివాసిలకు అడుగుడుగునా అన్యాయం జరుగుతుందన్నారు. పోడుభూములతో పాటు ఆదివాసిలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాయిసెంటర్‌ జిల్లా, మండల అధ్యక్షులు పెంద్రం రాముపటేల్‌, శ్రీనివాస్‌, తుడుం దెబ్బ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సోయం జంగు, మండల అధ్యక్షుడు కనక జంగు, సంఘం నాయకులు బాపు, సోము, కాంతరావు, ఎల్లయ్య, దాము, భీమరావు, వెంకటేష్‌, హన్మంత్‌, రాజేష్‌, రమేష్‌, పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 10:44 PM