Share News

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా

ABN , Publish Date - Sep 21 , 2024 | 10:21 PM

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మహిళలకు బతుక చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రిటైర్డ్‌ కార్మికులకు తెల్లరేషన్‌ కార్డులు, పింఛన్లు, పట్టణ ప్రజలకు తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తానన్నారు.

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా

శ్రీరాంపూర్‌, సెప్టెంబరు 21: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మహిళలకు బతుక చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రిటైర్డ్‌ కార్మికులకు తెల్లరేషన్‌ కార్డులు, పింఛన్లు, పట్టణ ప్రజలకు తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తానన్నారు. తాము ఎన్నో ఏండ్లుగా ఆడబిడ్డలకు చీరలు అందిస్తున్నామని, ఈ ఏడాది ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు వివరించారు.

అనంతరం పీఎస్‌ఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అభిమానులు పూలమాలతో సత్కరిం చారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో పలు వార్డులకు చెందిన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ సురిమిల్ల వేణు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బండారి సుధాకర్‌, కౌన్సిలర్లు బడికె లక్ష్మీ, బౌతు లక్ష్మీ, కుమార్‌, మహేష్‌, కాంగ్రెస్‌ మహిళా విభాగం పట్టణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పుట్ట యశోద, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 10:21 PM