Share News

బాణాసంచా అమ్మకాలకు అంతా సిద్ధం

ABN , Publish Date - Oct 29 , 2024 | 10:26 PM

బాణాసంచా అమ్మకాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇండ్లలో, లక్ష్మీ పూజల అనంతరం దుకాణాల్లో బాణాసంచా కాలుస్తారు. టపాసుల అమ్మకాలు, కొనుగోళ్లు, అమ్మకాలు బాగానే సాగుతాయి. దీపావళికి రెండు రోజులు ఉండగానే బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు అంతా సిద్ధం చేశారు.

బాణాసంచా అమ్మకాలకు అంతా సిద్ధం

మంచిర్యాల అర్బన్‌, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): బాణాసంచా అమ్మకాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇండ్లలో, లక్ష్మీ పూజల అనంతరం దుకాణాల్లో బాణాసంచా కాలుస్తారు. టపాసుల అమ్మకాలు, కొనుగోళ్లు, అమ్మకాలు బాగానే సాగుతాయి. దీపావళికి రెండు రోజులు ఉండగానే బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు అంతా సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంతో పాటు సీసీసీ నస్పూర్‌, శ్రీరాంపూర్‌, చెన్నూరు, లక్షెట్టిపేట, రామకృష్ణాపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లో షాపులను ఏర్పాటు చేస్తారు. ఈ యేడు జిల్లా వ్యాప్తంగా షాపులను ఏర్పాటు చేసేందుకు 106 దరఖాస్తులు రాగా వాటిలో 98 షాపులకు అనుమతులిచ్చినట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో 19 షాపులకు అనుమతులు ఇచ్చినట్లు వారు తెలిపారు.

ఫైర్‌ నిబంధనలు తప్పనిసరి పాటించాలి

--జిల్లా అగ్నిమాపక అధికారి మామిడి భగవాన్‌ రెడ్డి..

దీపావళి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాల నిర్వాహకులు ఫైర్‌ సేఫ్టీ నిబంధనలను పాటించాలి. టపాసులు పేల్చేటప్పుడు ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలి. చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలి. కాటన్‌ దుస్తులు ధరించాలి. మండే స్వభావం ఉండే వస్తువుల వద్ద టపాసులను కాల్చవద్దు.

Updated Date - Oct 29 , 2024 | 10:26 PM