Home » Bellampalli
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హరీష్రాజ్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లిలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో తాండూర్, తాల్లగురిజాల, నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మత్య్సకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గడ్డం వినోద్వెంకటస్వామి అన్నారు. సోమవారం బోయపల్లి పెద్ద చెరువులో అధికారులతో కలిసి 9 వేల చేప పిల్లలను వదిలారు. ఆయన మాట్లాడుతూ చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
కాసిపేట మండలంలోని పెద్ద ధర్మారం సమీపంలోకి శనివారం తెల్లవారుజామున పెద్దపులి వచ్చింది. దీంతో స్ధానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గత ఆదివారం మామిడిగూడెం పంచాయతీ గోండుగూడకు చెందిన చిత్రు అనే గిరిజన రైతుకు చెందిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసి మూడు ఆవులను చంపిన విషయం తెలిసిందే.
తెలంగాణకే తలమానికమైన సింగరేణి పరిరక్షణకు సమరశీల పోరాటాలు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. శనివారం సీపీఎం పార్టీ మూడవ మహాసభల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మండలంలోని రేపల్లెవాడలోని శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా నిర్వహించే పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
పట్టణంలోని ప్రాణహిత కాలనీ సమీ పంలో గల లెదర్ పార్కు మధ్యలో నుంచి వేసి న రోడ్డును నిలిపివేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సింగరేణి అధికారులను ఆదేశించారు. బుధవారం లెదర్ పార్కును సంద ర్శించారు.
ఎన్నికల సమయంలో గడ్డం వినోద్ అబద్దపు హామీలు ఇచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలను మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధ వారం 2వ వార్డులో 200 మందికి పైగా బీఆర్ఎస్ పార్టీలో చేరగా మాజీ ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు.
మంచిర్యాల ఫారెస్టు డివిజన్ పరిధిలోకి పెద్దపులి వచ్చింది. ఆదివారం సాయంత్రం ముత్యంపల్లి సెక్షన్ మామిడిగూడలోని గోండుగూడకు చెందిన గిరిజన రైతు చిత్రు ఆవుల మందపై దాడి చేసి మూడు ఆవులను చంపింది. దీంతో పెద్దపులి వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సంచరిస్తున్న పెద్దపులి ఎస్ 12 మగ పులిగా అధికారులు భావిస్తున్నారు.
ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి క్యాంపు కార్యాయలంలో కాసిపేట మండలానికి చెందిన 17 దండారీ గ్రూపులకు ఒక్కో గ్రూపుకు రూ. 15 వేల చెక్కులను అందజేసి మాట్లాడారు.
అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మహిళల ఉన్నతితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యపడుతుందన్నారు. మండల కేంద్రంలో స్వయం సహాయ సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్ల విక్రయ కేంద్రం, పిండి వంటలు, పచ్చళ్ల తయారీ కేంద్రం, మెడికల్ స్టోర్ను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.