Share News

పూర్వ విద్యార్థుల సిల్వర్‌ జూబ్లీ వేడుక

ABN , Publish Date - Oct 01 , 2024 | 10:06 PM

శ్రీరాంపూర్‌లోని భగత్‌సింగ్‌ విద్యామందిర్‌ పాఠశాలకు చెందిన 1998-99 పదోతరగతి పూర్వ విద్యార్థులు మంగళ వారం సిల్వర్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించుకున్నారు. తమ బ్యాచ్‌ పదో తరగతి పూర్తి చేసుకుని 25 ఏళ్లు అయిన సందర్భంగా నస్పూర్‌ కాలనీ లోని సింగరేణి గార్డెన్స్‌లో వేడుకలు ఏర్పాటు చేశారు.

పూర్వ విద్యార్థుల సిల్వర్‌ జూబ్లీ వేడుక

శ్రీరాంపూర్‌, అక్టోబరు 1: శ్రీరాంపూర్‌లోని భగత్‌సింగ్‌ విద్యామందిర్‌ పాఠశాలకు చెందిన 1998-99 పదోతరగతి పూర్వ విద్యార్థులు మంగళ వారం సిల్వర్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించుకున్నారు. తమ బ్యాచ్‌ పదో తరగతి పూర్తి చేసుకుని 25 ఏళ్లు అయిన సందర్భంగా నస్పూర్‌ కాలనీ లోని సింగరేణి గార్డెన్స్‌లో వేడుకలు ఏర్పాటు చేశారు. వారి బాల్య స్మృతు లను గుర్తు చేసుకుని తమ జీవితాలను సరైన మార్గంలో నడిపిం చిన గురువులను సత్కరించారు. పాఠశాల వ్యవస్థాపకుడు, ప్రధానాచార్యులు అయిన వానమామలై సత్యనారాయణాచార్యులకు నివాళుల ర్పించారు. ఆయన ఎంతో మంది విద్యార్థులకు దిశానిర్దేశం చేశారని కొనియాడారు.

Updated Date - Oct 01 , 2024 | 10:06 PM