Share News

ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Sep 19 , 2024 | 11:40 PM

వానాకాలా నికి సంబంధించి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయా లని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. గురువారం కలె క్టరేట్‌లో రైసుమిలర్లు, అధికారులతో సమావేశం నిర్వ హించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు ఇబ్బం దులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 19: వానాకాలా నికి సంబంధించి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయా లని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. గురువారం కలె క్టరేట్‌లో రైసుమిలర్లు, అధికారులతో సమావేశం నిర్వ హించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు ఇబ్బం దులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 3లక్షల29 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అం చనా వేశామన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం జిల్లాలోకి రాకుండా చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలె క్టర్‌ మోతిలాల్‌, జిల్లా పౌరసరఫరా అధికారి బ్రహ్మ రావు, అధికారులు సంజీవరెడ్డి, కిషన్‌, తిరుపతి, సం తోష్‌కుమార్‌, కల్పన, ప్రమోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

సీఎంఆర్‌ లక్ష్యాలను పూర్తి చేయాలి

జిల్లాలోని రైసుమిల్లులకు కేటయించిన సీఎంఆర్‌ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిం చిన మిల్లులపై చర్యలు తీసుకొంటామని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. కలెక్టరేట్‌లో రైసుమిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 30లోగా సీఎంఆర్‌ లక్ష్యాలను పూర్తి చేయాల న్నారు.

అభివృద్ధి పనులను పకడ్బందీగా నిర్వహించాలి

చెన్నూరు: మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనులను పకడ్బందీగా నిర్వహించాలని కలె క్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మున్సిపల్‌, తహసీల్దార్‌ కార్యాలయాలను సందర్శించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వార్డులు శుభ్రంగా ఉండేలా నిరంతరం పారిశుధ్య ప నులు చేయించాలని సూచించారు. అంతర్గత రహదా రులు, మురుగు కాలువల్లో చెత్తాచెదారం తొలగించా లన్నారు. తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం లోని రిజిష్టర్‌లు, రికార్డులు పరిశీలించారు. ధ్రువప త్రాల కోసం చేసుకున్న దరఖాస్తులను నిర్ణీత గడువు లోగా అందించాలని, ధరణి పోర్టల్‌ ద్వారా భూ సమ స్యలను పరిష్కరించాలని సూచించారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదు లు, వంటశాల, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థు లకు నాణ్యమైన బోధన చేయాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలన్నారు. తరగతి గదిలో విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. కోటపల్లి మండలంలోని పీహెచ్‌సీ, కస్తూర్బా పాఠశాలను, పం చాయతీ కార్యాలయాలను సందర్శించారు. రికార్డులను, రిజిష్టర్‌లను పరిశీలించారు. మున్సిపల్‌ కమిషనర్‌ గంగాధర్‌, తహసీల్దార్‌ మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2024 | 11:40 PM