Share News

బొగ్గు బ్లాకుల వేలం పాటను రద్దు చేయాలి

ABN , Publish Date - Nov 21 , 2024 | 10:23 PM

కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాటను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోమాస ప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. వేలం పాటలను రద్దు చేయాలని గురువారం ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద సంతకాల సేకరణ చేప ట్టారు. ఆయన మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు.

బొగ్గు బ్లాకుల వేలం పాటను రద్దు చేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాటను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోమాస ప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. వేలం పాటలను రద్దు చేయాలని గురువారం ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద సంతకాల సేకరణ చేప ట్టారు. ఆయన మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. పని చేస్తున్న కార్మికులను బలవంతంగా ఇండ్లకు పంపించే కుట్రలో భాగంగా బొగ్గు బ్లాకులకు వేలం పాటలు నిర్వహిస్తోందన్నారు. వేలం పాటలను రద్దు చేసి బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రేమ్‌కుమార్‌, రాజ్‌కుమార్‌, మోహన్‌ పాల్గొన్నారు.

కాసిపేట, (ఆంధ్రజ్యోతి): బొగ్గు బ్లాకుల వేలం పాటలను రద్దు చేయా లని సీపీఎం నాయకులు సోమగూడెం చౌరస్తా వద్ద ర్యాలీ నిర్వహిం చారు. ర్యాలీకి ఆటో యూనియన్‌ నాయకులు సంఘీభావం తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ బొగ్గు బ్లాకుల వేలం పాటలను నిరసిస్తూ ఈ నెల 18 నుంచి సంతకాల సేకరణ చేపడుతు న్నామని తెలిపారు. సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దూలం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 10:23 PM