సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Sep 09 , 2024 | 10:31 PM
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉం డాలని జిల్లా ఇన్చార్జీ కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. సోమవారం ప్రభు త్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను, రికార్డులను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, చికున్ గున్యా, డెంగ్యూ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
చెన్నూరు, సెప్టెంబరు 9: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉం డాలని జిల్లా ఇన్చార్జీ కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. సోమవారం ప్రభు త్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను, రికార్డులను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, చికున్ గున్యా, డెంగ్యూ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. రోగులకు మెరుగైన చికిత్స అం దించాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. పారిశుధ్య పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తంచేశారు. లైన్గడ్డ చెరువు కట్ట ప్రాంతాలను పరిశీలించారు. తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్కమిషనర్ గంగాధర్ ఉన్నారు.
కోటపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మి కంగా తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల న్నారు. మండలంలోని ఆల్గామ గ్రామంలో పర్యటించారు. గ్రామస్థులతో ఆమె మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.