Share News

సీసీఐ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Nov 20 , 2024 | 10:33 PM

రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించాలని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి కోరారు. బుధవారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి సీసీఐ ఆధ్వర్యంలో చెన్నూరు కాటన్‌ కంపెనీలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పత్తిని సీసీఐ కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను పొందాలన్నారు.

సీసీఐ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

చెన్నూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించాలని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి కోరారు. బుధవారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి సీసీఐ ఆధ్వర్యంలో చెన్నూరు కాటన్‌ కంపెనీలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పత్తిని సీసీఐ కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను పొందాలన్నారు. రైతులను దళారులను ఆశ్రయించి వారి చేతుల్లో మోసపోవద్దన్నారు. అయితే రైతులు ప్రభుత్వం ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేస్తుందని, దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి ఎకరానికి 16 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మార్కెట్‌ కమిటీ కార్యదర్శి రామానుజం, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

సహకార సంఘాలను బలోపేతం చేయాలి

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సహకార సంఘాలను బలోపేతం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. 71 అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా మోర్ల లక్ష్మణ్‌ అధ్యక్షతన మండలంలోని సుద్దాల గ్రామంలో శ్రీబాలాజీ పరస్పర సహాయక సహకార పొదుపు సం ఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సహకార సంఘాలు పరస్పరం సహకరించుకుని సమన్వయంగా ప్రగతిపథంలో ముందుకు నడవాలన్నారు. జిల్లా సహకార సంఘం అధికారి సంజీవ్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ చల్లం రాంరెడ్డి, లక్ష్మణ్‌, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 10:33 PM