శ్మశాన వాటిక విరాళాలు వాపస్ ఇవ్వాలి
ABN , Publish Date - Nov 29 , 2024 | 10:53 PM
మం చిర్యాల గోదావరి తీరంలో శ్మశాన వాటిక నిర్మాణం పేరుతో వసూలు చేసిన విరాళాలను తిరిగి ఇవ్వా లని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావును ఉద్దేశించి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు వ్యాఖ్యానిం చారు. గోదావరి తీరంలో జరుగుతున్న శ్మశాన వాటిక నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరి శీలించారు. పనులను వేగవంతం చేయాలని ఎమ్మె ల్యే అఽధికారులను ఆదేశించారు.
మంచిర్యాల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మం చిర్యాల గోదావరి తీరంలో శ్మశాన వాటిక నిర్మాణం పేరుతో వసూలు చేసిన విరాళాలను తిరిగి ఇవ్వా లని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావును ఉద్దేశించి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు వ్యాఖ్యానిం చారు. గోదావరి తీరంలో జరుగుతున్న శ్మశాన వాటిక నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరి శీలించారు. పనులను వేగవంతం చేయాలని ఎమ్మె ల్యే అఽధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ డిసెంబరు 7వ తేదీలోగా ఎవరి డబ్బులు వారికి తిరిగి చెల్లించాలన్నారు. శ్మశాన వాటిక నిర్మా ణానికి పలువురి నుంచి సుమారు రూ.90 లక్షలు చందాలు వసూలు చేసి సంవత్సరాలు గడుస్తున్నా యన్నారు. వసూలు చేసిన డబ్బులతో శ్మశాన వాటిక నిర్మించలేని నాయకుడు తిరిగి వాటిని దాతలకు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నాడని నిలదీశారు. డిసెంబరు 7వ తేదీలోపు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే 8, 9 తేదీ ల్లో చందాలు వసూలు చేసిన వారితోపాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిపై దాత లు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. ఎన్ని శక్తులు అడ్డుకోవాలని చూసినా, మంచిర్యాల నియో జకవర్గ అభివృద్ధి, సంక్షేమం ఆగదని తేల్చి చెప్పారు. రెం డేళ్లలో 20 సంవత్సరాల అభి వృద్ధిని చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సం దర్భంగా పది రోజులపాటు విజయోత్సవాలు జరు పుకుంటున్నామని, ఈ తరుణంలో బీఆర్‌ఎస్ పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం సబబు కాదన్నారు. మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల పరిధిలో పోలీస్, మున్సిపల్ శాఖల అనుమతి లేకుండా జెం డాలు ఏర్పాటు చేసినందునే అధికారులు వాటిని తొలగించారని తెలిపారు. ఎమ్మెల్యే మార్కెట్ రోడ్డు లో పర్యటిస్తూ రోడ్డు వెడల్పులో భాగంగా స్వచ్ఛం దంగా నిర్మాణాలు తొలగిస్తున్న వ్యాపారులు, ప్రజ లకు కృతజ్ఞతలు తెలిపారు.నాయకులు పాల్గొన్నారు.