Share News

చాకలి ఐలమ్మ జీవితం అందరికి మార్గదర్శకం

ABN , Publish Date - Sep 10 , 2024 | 10:56 PM

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికి మార్గదర్శకమని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

చాకలి ఐలమ్మ జీవితం అందరికి మార్గదర్శకం

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 10: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికి మార్గదర్శకమని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ విముక్తి ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటాలు మర్చిపోలే నివన్నారు. అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, అధికారులు వినోద్‌కుమార్‌, రజక సంఘం నాయకులు వెంకటేశం, భాగ్య, లక్ష్మణ్‌, బాపు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలో రజక రిజర్వేషన్‌ సమితి నాయ కులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. లక్ష్మణ్‌రావు, ఎల్లయ్య, శ్రీకాంత్‌, రమేష్‌, కొమురయ్య, శంకర్‌, కుమార్‌, పాల్గొన్నారు.

దండేపల్లి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని వ్యవసాయ మర్కెట్‌ కమి టీ చైర్మన్‌ దాసరి ప్రేమ్‌చందు, ఆర్‌జీపీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తిలు అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి పురస్కరించుకొని దండేపల్లిలో ఐల మ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కట్కూరి రాజన్న, మండల అధ్యక్షుడు పుట్టపాక తిరుపతి, ముత్యాల శ్రీనివాస్‌, సత్యం, వెంగళ్‌రావు, పాల్గొన్నారు. మాదా పూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో మ్యాదరిపేట రజక సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోట్‌ బుక్స్‌తో పాటు పెన్నులు, పెన్సిల్స్‌ను మందపల్లి వెంకటేష్‌ పంపిణీ చేశారు.

Updated Date - Sep 10 , 2024 | 10:56 PM