Share News

సీఎం సహాయ నిధి పథకం పేదలకు వరం

ABN , Publish Date - Nov 07 , 2024 | 10:38 PM

సీఎం సహాయ నిధి పథకం పేదలకు వరమని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రూ. 10,40,500 విలువ గల 50 సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పథకం వల్ల పేదలకు ఎంతో ఆర్ధిక మేలు జరుగు తుందన్నారు.

సీఎం సహాయ నిధి పథకం పేదలకు వరం

జన్నారం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): సీఎం సహాయ నిధి పథకం పేదలకు వరమని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రూ. 10,40,500 విలువ గల 50 సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పథకం వల్ల పేదలకు ఎంతో ఆర్ధిక మేలు జరుగు తుందన్నారు.

అనంతరం 13 దండారీలకు రూ. 1.95 లక్షల విలువగల చెక్కుల ను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజన సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రబుత్వం దండారీ ఉత్సవాలకు రూ.1.50 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ముజాఫర్‌ ఆలీఖాన్‌, తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీవో శశికళ, కాంగ్రెస్‌ నాయకు లు రాజశేఖర్‌, ఇసాక్‌, ఇందయ్య, రమేష్‌, రాజన్న యాదవ్‌, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 10:38 PM