Share News

mancherial మార్కెట్‌ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి

ABN , Publish Date - Nov 12 , 2024 | 10:20 PM

ఆర్మూర్‌ నుంచి మంచిర్యాల వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ హైవే విస్తరణలో భూముల కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేయాలని హాజీపూర్‌, లక్షెట్టిపేట మండలాలకు చెందిన రైతులు కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం భూములకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

mancherial మార్కెట్‌ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి

నస్పూర్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఆర్మూర్‌ నుంచి మంచిర్యాల వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ హైవే విస్తరణలో భూముల కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేయాలని హాజీపూర్‌, లక్షెట్టిపేట మండలాలకు చెందిన రైతులు కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం భూములకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు రోడ్డు విస్తరణ పనులు నిలిపి వేయాలన్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అందించారు.

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ రైతులతో మాట్లాడారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూములు, ఇండ్లు కోల్పోయామని, మళ్ళీ భూములను నష్ట పోవాల్సి వస్తోందని పలువురు రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. రైతులకు మద్దతుగా వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ మాట్లాడుతూ ఇప్పటికే ఎల్లంపల్లి వలన నష్టపోయి ఉన్న వారిని మరింత నష్టపోకుండ న్యాయం చేయాలన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వలన నష్టపోయిన విషయం ఉన్నతాధికారులకు తెలిదని, స్థానిక పరిస్థితులపై వివరించాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉందన్నారు. న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన బీజేపీ అండగా ఉంటుందన్నారు. నిర్వాసిత రైతులు సత్తయ్య, స్వామిరెడ్డి, గొల్ల తిరుపతి, కొండల్‌రెడ్డి, లక్ష్మన్‌, పెట్టం తిరుపతి, పాదం శ్రీనివాస్‌, లతో పాటు బీజేపీ నాయకులు సత్రం రమేష్‌, కుర్ర చక్రి, కిశోర్‌, ప్రవీణ్‌, బుద్దె లక్ష్మన్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 10:20 PM