Share News

పూర్తయిన ఊర చెరువు సర్వే

ABN , Publish Date - Sep 13 , 2024 | 10:21 PM

మండల కేంద్రంలోని ఊర చెరువు సర్వే శుక్రవారంతో పూర్తయ్యింది. కొంత కాలంగా సర్వే చేసినప్పటికీ హద్దులకు నోచుకోకుండా పోయింది. భీమారం గ్రామానికి చెందిన యువకులు కలెక్టర్‌కు ఫిర్యా దు చేయడంతో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు వారం రోజుల నుంచి సర్వే పనులు చేసి శుక్రవారం చెరువు హద్దులను ఏర్పాటు చేసి మార్కింగ్‌ పూర్తి చేశారు.

పూర్తయిన ఊర చెరువు సర్వే

భీమారం, సెప్టెంబరు 13: మండల కేంద్రంలోని ఊర చెరువు సర్వే శుక్రవారంతో పూర్తయ్యింది. కొంత కాలంగా సర్వే చేసినప్పటికీ హద్దులకు నోచుకోకుండా పోయింది. భీమారం గ్రామానికి చెందిన యువకులు కలెక్టర్‌కు ఫిర్యా దు చేయడంతో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు వారం రోజుల నుంచి సర్వే పనులు చేసి శుక్రవారం చెరువు హద్దులను ఏర్పాటు చేసి మార్కింగ్‌ పూర్తి చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ సదానందం మాట్లాడుతూ, గ్రామస్థుల సమక్షంలో ఊర చెరువు సర్వే నెంబర్‌ 570లో 14 ఎకరాల 39 గుంటల భూమికి హద్దులు ఏర్పాటు చేశా మని, సర్వే రిపోర్టును ఇరిగేషన్‌ అధికారులు మార్కింగ్‌ చేసిన చోట ఫిక్స్‌డ్‌ హద్దురాళ్లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

సర్వే పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌కు అందిస్తా మన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇరిగేషన్‌ డీఈ శారద, ఏడీఈ సర్వేయర్‌ శ్రావణ్‌కుమార్‌, ఇరిగేషన్‌ ఈఈ విష్ణువర్దన్‌, ఆర్‌ఐ స్రవంతి, ఇరిగేషన్‌ ఏఈ అఖిల్‌ ఉన్నా రు. ఎస్‌ఐ రాములు ఆధ్వర్యంలో పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తును నిర్వహించారు.

Updated Date - Sep 13 , 2024 | 10:21 PM