Share News

గిరిజనులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

ABN , Publish Date - Sep 08 , 2024 | 10:32 PM

ఆదిమ గిరిజనులైన కొలాంలు నివసించే కొలాంగూడకు అండగా ఉం టామని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆది వారం పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధి కొలాం గూడలో రూ.38.15 లక్షలతో నిర్మించే పాఠశాల భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పలు వురు కొలాంగూడ వాసులు తాము అడవికి వెళ్లి వెదురు బొంగు తెచ్చుకునేందుకు అటవీ అధికారు లు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేకు మొర పెట్టుకు న్నారు.

గిరిజనులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

హాజీపూర్‌, సెప్టెంబరు 8: ఆదిమ గిరిజనులైన కొలాంలు నివసించే కొలాంగూడకు అండగా ఉం టామని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆది వారం పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధి కొలాం గూడలో రూ.38.15 లక్షలతో నిర్మించే పాఠశాల భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పలు వురు కొలాంగూడ వాసులు తాము అడవికి వెళ్లి వెదురు బొంగు తెచ్చుకునేందుకు అటవీ అధికారు లు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేకు మొర పెట్టుకు న్నారు. అధికారులతో మాట్లాడి అనుమతులు ఇప్పి స్తానని ఎమ్మెల్యే తెలిపారు. కొలాంవాసులు సొసైటీ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం నుంచి రుణాలను మంజూరు చేయిస్తామని తెలిపారు. పలువురు రైతులు పొలాలకు వెళ్లే దారి వర్షానికి బురదమ యం అవుతుందని బీటీ రోడ్డు వేయించాలని కోరా రు. రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యేకు తెలుపగా మం డల అధికారితో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్క రించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులకు మెరుగైన వసతులతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్య మైన విద్య అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్య మని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను కొలాంగూడకే మంజూరు చేయించి, గృహాలకు సోలార్‌ విద్యుత్‌ను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో 70 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఫారెస్టు అధి కారులు ట్రెంచు కొట్టారని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా సర్వే చేయించి ప్రభుత్వ భూమి అని తేలితే పేదలకు, నిర్వాసితులకు పం పిణీ చేస్తామని తెలిపారు. టీజీడబ్య్లూఐడీసీ డీఈ శ్రీనివాస్‌, ఏఈ రాజేశం, ఎంఈవో పోచన్న, పీఏసీ ఎస్‌ చైర్మన్‌ కోట సత్తయ్య, మంచిర్యాల పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ సర్పంచు పొట్టాల సుమలత, శ్రీశైలంగౌడ్‌, ఎంపీటీసీ బాలరాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరుపతి, మండల అధ్యక్షుడు తోట రవి, సంజీవరావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ప్రైవేటు ఉపాధ్యాయులకు బీమా కల్పిస్తాం

శ్రీరాంపూర్‌: ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపా ధ్యాయులకు జీవిత బీమా కల్పించేందుకు కృషి చేస్తాన ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. ప్రైవే టు పాఠశాలల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవే టు పాఠశాలల యాజమా న్యాలు, ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించేలా చూస్తామ న్నారు. విద్యావంతులను తయారు చేసేది ఉపాధ్యాయులేనన్నారు. ఉన్నతమైన వృత్తిలో ఉన్న వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది ఉపాధ్యా య దినోత్సవం సందర్భంగా ప్రభు త్వ ఉపాధ్యాయులతోపాటుగా ప్రై వేటు టీచర్లకు ప్రాధాన్యం ఇచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. కరీం నగర్‌ జిల్లా న్యాయమూర్తి ప్రీతి, ట్రస్మా రాష్ట్ర ముఖ్య సలహాదారు లు యాదగిరి శేఖర్‌ రావు, జిల్లా అధ్యక్షుడు దామెర్ల సిద్ధయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, కోశాధికారి చంద్రమోహన్‌ గౌడ్‌, మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రావు, పట్టణాధ్యక్షుడు దుర్గా ప్రసాద్‌, నాయకులు పద్మచరణ్‌, బాలాజీ, విక్రమ్‌రావు, భాగ్యలక్ష్మీ, మధుసూదన్‌, లక్ష్మీనారా యణ, పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2024 | 10:32 PM