Share News

జిల్లా కోర్టు భవన నిర్మాణం చేపట్టాలి

ABN , Publish Date - Nov 05 , 2024 | 10:48 PM

జిల్లా కోర్టుకు భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ మంచిర్యాల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండవరం జగన్‌ మంగళ వారం ఒకరోజు మౌనదీక్ష చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్దగల హనుమాన్‌ విగ్రహం వద్ద ఆయన ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేశారు.

జిల్లా కోర్టు భవన నిర్మాణం చేపట్టాలి

మంచిర్యాల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా కోర్టుకు భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ మంచిర్యాల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండవరం జగన్‌ మంగళ వారం ఒకరోజు మౌనదీక్ష చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్దగల హనుమాన్‌ విగ్రహం వద్ద ఆయన ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేశారు.

ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుకు కాంగ్రెస్‌ అధిష్టానం మంత్రి పదవి ఇవ్వాలని, అలాగే జిల్లా కోర్టు శాశ్వత భవన నిర్మాణానికి ప్రేంసాగర్‌రావు కృషి చేయాలని కోరారు. దీక్ష సమయంలో హనుమాన్‌ చాలీసా, భగవద్గీత పారాయణం చేశారు. జగన్‌కు జిల్లాలోని న్యాయవాదులు సంఘీభావం ప్రకటించారు. న్యాయవాదులు కొట్టె నటేశ్వర్‌, గోలి శ్రీనివాస్‌, రవికుమార్‌, భీమయ్య, ప్రదీప్‌చంద్ర, విజయ్‌, వినీత్‌, సోమ రాములు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 10:48 PM