నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Nov 29 , 2024 | 10:55 PM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్య లు తీసుకుంటుందన్నారు.
భీమారం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్య లు తీసుకుంటుందన్నారు. సుంకరిపల్లి, భీమారం, ఆరేపల్లి, మద్దికల్ గ్రామా ల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సన్నరకం వడ్లకు మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తోందన్నారు. కొనుగోలు చేసిన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామ న్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అనంత రం కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సందర్శించి వంటశాల, ఆహార నిల్వ లు, గదులు, పరిసరాలు, రిజిస్టర్‌లను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువల గల ఆహారాన్ని అందించాలని, శుద్ధమైన తాగు నీటిని ఇవ్వాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. తహసీ ల్దార్ సదానందం, ఏపీఎం త్రయంబకేశ్వర్, ఆర్‌ఐ స్రవంతి, పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన తహసీల్దార్
జన్నారం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మురిమడుగు ఉన్నత పాఠశా లను శుక్రవారం తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి తనిఖీ చేశారు. మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రోజు నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎంఈ వో విజయ్‌కుమార్, ప్రధానోపాధ్యాయుడు అజయ్‌కుమార్, ఉపాధ్యాయులు రాజన్న, తిరుపతి, అంకుస్,సురేష్‌కుమార్,వినోద్‌కుమార్ పాల్గొన్నారు.