పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం
ABN , Publish Date - Sep 30 , 2024 | 10:26 PM
మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని సోమ వారం కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ రావుల ఉప్పలయ్య అధ్యక్షతన నిర్వహించారు. పట్ట ణంలో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 30 : మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని సోమ వారం కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ రావుల ఉప్పలయ్య అధ్యక్షతన నిర్వహించారు. పట్ట ణంలో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ సాధారణ నిధులు రూ.60.90లక్షలను అభివృద్ధి పనులకు కేటా యించారు. టెండర్ ప్రకటన బిల్లుల చెల్లింపునకు రూ.30,114లను కేటాయించగా, 14వ ఎఫ్‌సీ కమీ షన్ 2016-17, 2017-18 సంవత్సరానికి మిగులు నిధులు రూ.4కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు ఆమోదం తెలిపారు. పట్టణంలో పలు కేసుల వాద నల ఫీజుల కోసం రూ.3.65లక్షలను కేటాయించగా, డ్రోన్‌తో సర్వే చేసేందుకు సర్వే ఆఫ్ ఇండియా డీటీసీపీ సహకారంతో మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిం చేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ వైస్‌చైర్మన్ సల్ల మహేష్, కౌన్సిల్ స భ్యులు, కోఆప్షన్ సభ్యులు, కమిషనర్ అల్లె మారుతీప్రసాద్, ఎంఈ మసూ ద్‌అలీ, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ సంపత్, ఆర్‌ఓ శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌చార్జి సానిటరి ఇన్‌స్పెక్టర్ ఉదయ్‌కిరణ్ పాల్గొన్నారు.
నస్పూర్: నస్పూర్ మున్సిపాలిటీ సమావేశం చైర్మన్ సుర్మిళ్ళ వేణు అద్యక్షతన జరిగింది. సమావేశంలో 29 అంశాలపై చర్చించి ఆమోదిం చింది. వైస్ చైర్‌పర్సన్ గెల్లు రజిత, కమిషనర్ చిట్యాల సతీష్, ఆర్‌ఓ శ్రీనివాస్, ఏఈ మధు, కౌన్సిలర్లు, కోఅప్షన్ సభ్యులు పాల్గొన్నారు.