పోలీస్‌స్టేషన్‌లను తనిఖీ చేసిన డీసీపీ
ABN , Publish Date - Nov 06 , 2024 | 10:53 PM
తాండూర్ సర్కిల్ కార్యాలయం, మాదారం పోలీస్‌స్టేషన్‌ను డీసీపీ భాస్కర్ బుధ వారం తనిఖీ చేశారు. ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీక రించారు. అనంతరం రిసెప్షన్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, స్టేషన్ రైటర్, ప్రాసెస్ అప్లికేషన్‌ల ద్వారా తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు.
తాండూర్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): తాండూర్ సర్కిల్ కార్యాలయం, మాదారం పోలీస్‌స్టేషన్‌ను డీసీపీ భాస్కర్ బుధ వారం తనిఖీ చేశారు. ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీక రించారు. అనంతరం రిసెప్షన్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, స్టేషన్ రైటర్, ప్రాసెస్ అప్లికేషన్‌ల ద్వారా తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల ఫైల్స్, రికార్డుల ను పరిశీలించారు. డీసీపీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మెలగాలన్నారు. గ్రామాల్లో గస్తీ పెంచాలని, డయల్ 100 ఫిర్యాదుకు వేగంగా స్పందించాలన్నారు. ఏసీపీ రవికుమార్, సీఐకుమారస్వామి, ఎస్‌ఐ సౌజన్య పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
భీమిని, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): భీమిని పోలీస్‌స్టేష న్‌ను బుధవారం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తనిఖీ చేశారు. ఏసీపీకి ఎస్‌ఐ విజయ్‌కుమార్ పుష్పగుచ్ఛం అందించి స్వాగ తం పలికారు. ఏసీపీ స్టేషన్ పరిసరాలను పరిశీలించి రికార్డు లను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలు సుకున్నారు. ఏసీపీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. డయల్ 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించాలన్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి ప్రజలకు, వ్యాపారులకు అవగా హన కల్పించాలన్నారు. ఎస్‌ఐ విజయ్‌కుమార్, పోలీసులు పాల్గొన్నారు.