నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి
ABN , Publish Date - Dec 23 , 2024 | 10:59 PM
చెన్నూరు మండలం బాబూరావు పేట శివారులో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇంటి పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ ఏవోకు అందించారు.
నస్పూర్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): చెన్నూరు మండలం బాబూరావు పేట శివారులో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇంటి పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ ఏవోకు అందించారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్ వరకు ఉరేగింపుగా తరలివచ్చారు. నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళు, రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్నారు.
రెండు సంవత్సరాలుగా గుడిసెలు వేసు కుని నివాసం ఉంటున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఏరియా కార్యదర్శి బోడెంకి చందు, నాయకులు శ్యామల, ఉమారాణి, సీడం సమ్మక్క, నాగజ్యోతి, రవి, శారద, సరిత, రాజేశ్వరి, రాములు, రమాదేవి పాల్గొన్నారు.