చెన్నూరులో ఉప ముఖ్యమంత్రి పర్యటన రద్దు
ABN , Publish Date - Aug 31 , 2024 | 11:03 PM
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన శనివారం చివ రి నిమిషంలో రద్దయింది. శివలింగాపూర్ వద్ద 11 మెగావాట్ల సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయ న వస్తారని ఏర్పాట్లు చేశారు. రూ.67 కోట్లతో నిర్మించిన పవర్‌ప్లాంటు ప్రారం భాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేం దుకు కాంగ్రెస్ నాయకులు నాలుగు రోజు లుగా సన్నద్ధం చేశారు.
చెన్నూరు, ఆగస్టు 31: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన శనివారం చివ రి నిమిషంలో రద్దయింది. శివలింగాపూర్ వద్ద 11 మెగావాట్ల సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయ న వస్తారని ఏర్పాట్లు చేశారు. రూ.67 కోట్లతో నిర్మించిన పవర్‌ప్లాంటు ప్రారం భాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేం దుకు కాంగ్రెస్ నాయకులు నాలుగు రోజు లుగా సన్నద్ధం చేశారు. సింగరేణి ఉన్నతా ధికారులు సైతం ఉపముఖ్యమంత్రి పాల్గొ నే కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. పవర్ ప్లాంట్ ప్రారంభం తర్వాత బహిరంగ సభ నిర్వహించేందుకు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణలు ప్రత్యేక చొరవ తీసు కుని ప్రతీ గ్రామం నుంచి 200 మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గోదావరి ఖని వరకు వచ్చిన ఉపముఖ్యమంత్రి చె న్నూరుకు రానున్నారని సమాచారంతో బహిరంగ సభకు వేలాది మంది తరలి వచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సభ ప్రాంగణంలో వేచి చూస్తుం డగా చివరి నిమిషంలో రద్దు అయినట్లు వార్త అందడంతో ఉసూరుమంటూ వెను దిరిగి వెళ్లిపోయారు.
ఖర్చులు వృథా
ఉపముఖ్యమంత్రి కార్యక్రమానికి సం బంధించి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో లక్ష ల రూపాయలను ఖర్చుచేశారు. షామియా నాల ఏర్పాట్లు, శిలాఫలకాలు, రహదారుల పరిశుభ్రం, బహిరంగ సభ ఏర్పాట్లు, విద్యు త్ తదితర సౌకర్యాలను కల్పించారు. కార్య క్రమం రద్దు కావడంతో ఏర్పాట్లకు వెచ్చిం చిన నిధులు వృథాగా మారాయి.
అనివార్య కారణాల వల్ల రద్దు
వాతావరణ పరిస్థితులు, కొన్ని అనివార్య కారణాల వల్ల రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెన్నూరు పర్యటన రద్దు అయినట్లు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి పేర్కొన్నారు. శనివారం రాత్రి ఎం ఆర్‌ఆర్ గార్డెన్‌లో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లా డారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క హెలీకాప్టర్‌లో రావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గం గుండా వచ్చారన్నారు. దీంతో షెడ్యూల్‌లో మార్పులు జరిగాయన్నారు. రుణమాఫీ పడని రైతులు ఎవరు ఆం దోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చెన్నూరు, కోటపల్లి మండలాల్లో విష జ్వరా లు ప్రబలుతున్న దృష్ట్యా ఆయా మండ లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నా రు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.