Share News

గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Sep 10 , 2024 | 10:58 PM

గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. మంగళవారం రాంపూర్‌, తిమ్మాపూర్‌, తపాలపూర్‌, సింగరాయిపేట, రోటిగూడ, చింతగూడ గ్రామాల్లో పర్య టించారు. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.

 గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

జన్నారం, సెప్టెంబరు 10: గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. మంగళవారం రాంపూర్‌, తిమ్మాపూర్‌, తపాలపూర్‌, సింగరాయిపేట, రోటిగూడ, చింతగూడ గ్రామాల్లో పర్య టించారు. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కడెం ప్రాజెక్టును పట్టించుకోలేదని, దీంతో ప్రాజెక్టు డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిందన్నారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.9.46 కోట్లు కేటాయించి కడెం ప్రాజెక్టు మరమ్మతు చేసిందన్నారు. ఇటీవల కురి సిన వర్షాలకు కడెం ప్రాజెక్టు చెక్కు చెదరకుండా సురక్షితంగా ఉం దన్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను, కల్వర్టులను బాగు చేయి స్తామన్నారు. పంట నష్టపోయిన రైతులు దిగులు చెందవద్దని, ప్రభు త్వం ఆదుకుంటుందన్నారు. త్వరలో అర్హులైన వారందరికి రేషన్‌ కార్డు లు, కొత్త పింఛన్‌లు అందిస్తామన్నారు. ముజాఫర్‌, మహ్మద్‌ ఇసాక్‌, పసివుల్లా, స్వామి,లక్ష్మీనారాయణ, అధికారులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పలువురు లబ్ధి దారులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. పేద కుటుంబాలకు పథకం ఎంతో భరోసా ఇస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చస్తుందన్నారు. తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీవో శశికళ, నాయకులు ముజా ఫర్‌ ఆలీ, మహ్మద్‌ఇసాక్‌, పసివుల్లా, స్వామి, పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 10:58 PM