Share News

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:05 PM

చెన్నూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పవర్‌ ప్లాంట్‌ గెస్ట్‌హౌజ్‌లో ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామితో కలిసి అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

జైపూర్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): చెన్నూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పవర్‌ ప్లాంట్‌ గెస్ట్‌హౌజ్‌లో ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామితో కలిసి అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు పెండింగ్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ద్వారా శుద్ధమైన తాగునీటిని అందించడంతోపాటు పైపులైన్ల మరమ్మతు పనులను చేపట్టాలన్నారు. అంతర్గత రహదారులు, భవనాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో వంగిన, విరిగిన స్తంభాలను తొలగించి నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని, తెగిన, వేలాడే విద్యుత్‌ తీగలను సరి చేయాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సీజనల్‌ వ్యాధులు, విష జ్వరాల నియంత్రణకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, ఆసుపత్రుల్లో పారిశుధ్యం నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు.

రోడ్లు, డ్రైనేజీలకు మరిన్ని నిధులు కేటాయిస్తాం

మందమర్రి టౌన్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): మందమర్రి మున్సిపాలిటీని మెగా మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామని, అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం రూ.3 కోట్లతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ గత పాలకులు మున్సిపాలిటీని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజల ఎజెండానే తన ఎజెండా అని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, నాయకులు నోముల ఉపేందర్‌ గౌడ్‌, దుర్గం నరేష్‌, సొత్కు సుదర్శన్‌, గుడ్ల రమేష్‌, పైడిమల్ల నర్సింగ్‌, జావిద్‌ఖాన్‌, పాషా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:05 PM