మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
ABN , Publish Date - Nov 05 , 2024 | 10:50 PM
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను కార్యాలయ ఏవో, విద్యా శాఖ సూపరింటెండెంట్‌కు అందించారు.
నస్పూర్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను కార్యాలయ ఏవో, విద్యా శాఖ సూపరింటెండెంట్‌కు అందించారు. మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు దాసరి రాజేశ్వరి, ఎండీ రఫీయాలు మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఎనిమిది నెలల నుంచి కోడి గుడ్డు బిల్లులు చెల్లించడంలేదన్నారు. మెనూ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐలను అమలు చేయాలన్నారు. సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. నాయకులు రబియా, లక్ష్మి, సరిత, తదితరులు పాల్గొన్నారు.