Share News

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:15 PM

సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు గురువారం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ అధికారికి అందజేశారు. యూనియన్‌ అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, జిల్లా కార్యదర్శి రఫీయాలు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు.

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా

నస్పూర్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు గురువారం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ అధికారికి అందజేశారు. యూనియన్‌ అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, జిల్లా కార్యదర్శి రఫీయాలు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు.

కోడిగుడ్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలన్నారు. ప్రతి స్కూల్‌కు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమాతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలను కల్పించాలన్నారు. వయస్సు పైబడి కార్మికులకు పదవీ విరమణ బెనిఫిట్స్‌ రూ.3 లక్షలు చెల్లించాలని, భోజన పథకంను ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వకూడదన్నారు. జిల్లా ఉపాధ్యక్షురాలు కరీంబీ, సీఐటీయు నాయకులు రమణ, ప్రకాష్‌, రంజిత్‌ కుమార్‌, జయరావు, లక్ష్మన్‌, దూలం శ్రీనివాస్‌, రాజేశం కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 11:15 PM