రేషన్ డీలర్ల ధర్నా
ABN , Publish Date - Sep 30 , 2024 | 10:23 PM
సమస్యలను పరిష్కరించాలని రేషన్ డీలర్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్‌కు అందించారు. రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్తయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గౌరవ వేతనంతోపాటు క్వింటాలు రూ.300 కమీషన్ చెల్లించాలన్నారు.
నస్పూర్, సెప్టెంబరు 30: సమస్యలను పరిష్కరించాలని రేషన్ డీలర్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్‌కు అందించారు. రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్తయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గౌరవ వేతనంతోపాటు క్వింటాలు రూ.300 కమీషన్ చెల్లించాలన్నారు.
ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో ఎలక్ర్టానిక్ వే బిడ్ర్జిని ఏర్పాటు చేయాలన్నారు. ఇన్సూరెన్స్‌తోపాటు హెల్త్‌కార్డులు ఇవ్వాలన్నారు. ఒక శాతం తరుగు ఇవ్వా లని డిమాండ్ చేశారు. బియ్యం బస్తాల హమాలీ చార్జీలు ప్రభుత్వమే భరించాలన్నారు. సత్యనారాయణరెడ్డి, సుదమల్ల కృష్ణ పాల్గొన్నారు.