డిజిటల్ కార్డు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Oct 03 , 2024 | 10:49 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం సోమగూడెం(కే) పం చాయతీలో సర్వే పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టు కింద సోమగూ డెం(కే) ఎంపిక చేశామన్నారు.
కాసిపేట, అక్టోబరు 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం సోమగూడెం(కే) పం చాయతీలో సర్వే పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టు కింద సోమగూ డెం(కే) ఎంపిక చేశామన్నారు. సర్వే సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్ళి వివరాలను నమోదు చేయాలని సూ చించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటా యని హెచ్చరించారు. ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఎంపీవో షేక్ సప్దర్ ఆలీ, సీనియర్ అసి స్టెంట్ లక్ష్మీనారాయణ, సిబ్బంది ఉన్నారు.
దండేపల్లి: కుటుంబ డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైౖర్మన్ కోట్నాక తిరుపతి సూచించారు. అల్లీపూర్ గ్రామ పంచాయతీలో సర్వేను పరిశీలించా రు. అర్హులైన ప్రజలందరికి కుటుంబ డిజిటల్ కార్డు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రజా సంక్షే మమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుం దన్నారు. ఇంటింటా చేపట్టే సర్వే ప్రక్రియను పరి శీలించారు. సర్వే ఫైలట్ ప్రాజెక్టుగా అల్లీ పూర్ గ్రామ పంచాయతీని ఎంపిక చేశారు. ఆర్డీవో రాములు సర్వే తీరును పరిశీలించారు. ఎంపీడీవో ప్రసాద్, ఎంపీవో విజయ్‌ప్రసాద్ ఉన్నారు.
చెన్నూరు: సంకారంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే నిర్వహించారు. ఇంటింటికి తిరిగి సర్వే చేప ట్టారు. నియోజకవర్గ నోడల్ అధికారి గణపతి, డీపీ వో వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజ్మత్ ఆలీ, సభ్యులు పాల్గొన్నారు.