Share News

బొగ్గు బ్లాకులను వేలం వేయవద్దు

ABN , Publish Date - Nov 22 , 2024 | 11:01 PM

సిం గరేణికి చెందిన బొగ్గు బ్లాకులను వేలం వేయవ ద్దని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు గోమాస ప్రకాష్‌ అన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకులను సం స్థకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వ ర్యంలో శ్రీరాంపూర్‌ ఓసీపీ, సీసీసీలోని ఆటోల అడ్డాలు, భవన నిర్మాణ కార్మికుల నుంచి సంత కాల సేకరణ చేపట్టారు.

బొగ్గు బ్లాకులను వేలం వేయవద్దు

శ్రీరాంపూర్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): సిం గరేణికి చెందిన బొగ్గు బ్లాకులను వేలం వేయవ ద్దని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు గోమాస ప్రకాష్‌ అన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకులను సం స్థకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వ ర్యంలో శ్రీరాంపూర్‌ ఓసీపీ, సీసీసీలోని ఆటోల అడ్డాలు, భవన నిర్మాణ కార్మికుల నుంచి సంత కాల సేకరణ చేపట్టారు. ప్రకాష్‌ మాట్లాడుతూ, జిల్లా ప్రజలు ఎంతో మంది సింగరేణిపై ఆధార పడి జీవిస్తున్నారన్నారన్నారు. చాలా కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయ న్నారు. సంస్థ ప్రైవేటుపరం అయితే పేదలకు, రైతులకు ఉచిత విద్యుత్‌ లేకుండా పోతుం దన్నారు. బొగ్గు బ్లాకులను సింగరేణికే ఇవ్వాలని, లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. సీపీ ఎం జిల్లా కమిటీ సభ్యులు ప్రేమ్‌ కుమార్‌, మిడివెల్లి రాజ్‌ కుమార్‌, మోహన్‌, పాల్గొన్నారు.

కాసిపేట, (ఆంధ్రజ్యోతి): ఆదాని, అంబానీ లను కుబేరులను చేసేందుకు మోదీ ప్రభుత్వం ఆరాట పడుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. కాసిపేట 2వ గని, కోమటి చేను, పల్లంగూడ, కోనూరు, ధర్మారావుపేట, కొం డాపూర్‌, మల్కేపల్లి గ్రామాల్లో కేంద్రం చేపడుతు న్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసి స్తూ ర్యాలీ, సంతకాల సేకరణ చేపట్టారు. బీ ఎస్‌ఎన్‌ఎల్‌ను అంబానికి, సింగరేణి ఆదానికి దోచి పెట్టేందుకు కేంద్రం కుట్రలు పన్ను తుంద న్నారు. బొగ్గు బ్లాకుల వేలం పాటలను రద్దు చేసి సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 22 , 2024 | 11:01 PM