Share News

బఫర్‌ జోన్లలో నిర్మాణాలు చేపట్టవద్దు

ABN , Publish Date - Sep 13 , 2024 | 10:25 PM

లక్షెట్టిపేట మున్సిపాలిటీ, మండల పరిధిలోని ఎల్‌ఎఫ్‌టీ, బఫర్‌ జోన్లలో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట వద్దని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కలె క్టర్‌ బొట్లకుంట, ఇటిక్యాల చెరువులను ఆయన పరిశీ లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎల్‌ఎఫ్‌ టీ, బఫర్‌ జోన్లలో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

 బఫర్‌ జోన్లలో నిర్మాణాలు చేపట్టవద్దు

లక్షెట్టిపేట రూరల్‌, సెప్టెంబరు 13: లక్షెట్టిపేట మున్సిపాలిటీ, మండల పరిధిలోని ఎల్‌ఎఫ్‌టీ, బఫర్‌ జోన్లలో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట వద్దని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కలె క్టర్‌ బొట్లకుంట, ఇటిక్యాల చెరువులను ఆయన పరిశీ లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎల్‌ఎఫ్‌ టీ, బఫర్‌ జోన్లలో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిబంధ నలు బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణాలకు పూను కుంటే వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు. ఎల్‌ ఎఫ్‌టీ, బపర్‌ జోన్ల పరిధిలోని భూములను గుర్తించి, వాటిలో నిర్మాణాలు ఉన్నట్లయితే తొలగించాలని అధి కారులను ఆదేశించారు. తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌, ఇరిగేషన్‌ అధికారు లు, తదితరులు పాల్గొన్నారు.

సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నిర్మాణ పనుల పరిశీలన

మంచిర్యాల కలెక్టరేట్‌: ప్రజల సౌకర్యార్థం జిల్లా కేం ద్రంలో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ ఏర్పాటు చేసేందుకు చర్య లు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల సమీపంలో డ్రగ్‌ స్టోర్‌ భవన నిర్మాణ పనులను ఆర్‌ ఎంవో శ్రీధర్‌, ప్రిన్సిపాల్‌ రమేష్‌లతో కలిసి పరిశీలిం చారు. కల్టెక్టర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నుంచి తీసుకువచ్చిన మందులను స్థానిక స్టోర్‌లో నిల్వ చేస్తా మన్నారు. ఇక్కడి నుంచి మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షె ట్టిపేట, చెన్నూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేస్తామన్నారు. గతం లో ఆదిలాబాద్‌ నుంచి మందుల సరఫరా జరిగేద న్నారు. నిర్మాణ పనులను సత్వరం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Updated Date - Sep 13 , 2024 | 10:25 PM