రక్తదానంతో ప్రాణాలను కాపాడవచ్చు
ABN , Publish Date - Oct 01 , 2024 | 10:16 PM
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయ డం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చని కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కుమార్‌దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేం ద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్బంగా లయన్స్‌క్లబ్ ఆధ్వ ర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్/అర్బన్, అక్టోబరు 1: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయ డం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చని కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కుమార్‌దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేం ద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్బంగా లయన్స్‌క్లబ్ ఆధ్వ ర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రో గ్రాం అధికారి డాక్టర్ అనిత, లయన్స్‌క్లబ్, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులతో కలిసి హాజరై జ్యోతీ ప్రజ్వ లన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయో జనాలను వివరించారు. శిబిరంలో 75 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు రెడ్‌క్రాస్ సభ్యులు తెలిపారు. ఎన్‌డీసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసాద్, బెల్లంపల్లి ఉపవైద్యాధికారి డాక్టర్ సుధాకర్‌నాయక్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు మధుసూదన్‌రెడ్డి, వాలేటి శ్రీని వాస్‌రావు, గోనె శ్యాంసుందర్‌రావు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కె.భాస్కర్‌రెడ్డి, కార్యదర్శి చందూరి మహేందర్, ఎడ్ల కిషన్, శంకర్‌వర్మ, మాస్ వీడి యా అధికారి బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సెంట్రల్ డ్రగ్ స్టోర్ పనులను వేగవంతం చేయాలి
మంచిర్యాల అర్బన్: జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల సమీపంలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నా రు. మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడు తూ హైదరాబాద్ నుంచి వచ్చిన మందులను నిల్వ చేస్తామని తెలిపారు. ఇక్కడి నుంచి మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూర్ ప్రభుత్వాసుపత్రు లకు, పీహెచ్‌సీలకు మందుల పంపిణీ జరుగుతుం దన్నారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.