Share News

తాగునీటి సమస్య పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 30 , 2024 | 10:36 PM

తాగునీటి సమస్య పరి ష్కరించాలని కౌన్సిలర్లు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు విన్నవించారు. శుక్రవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం వాడివేడీగా సాగింది. సమావేశానికి కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌ హాజరయ్యారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలి

బెల్లంపల్లి, ఆగస్టు 30: తాగునీటి సమస్య పరి ష్కరించాలని కౌన్సిలర్లు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు విన్నవించారు. శుక్రవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం వాడివేడీగా సాగింది. సమావేశానికి కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌ హాజరయ్యారు. పట్టణంలో తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొన్ని వార్డుల్లో వారానికి ఒకసారి తాగునీరు వస్తుందని కౌన్సిలర్‌ దామెర శ్రీను కలెక్టర్‌ దృష్టికి తీసుకువె ళ్లారు. రిటైర్డు సింగరేణి కార్మికుల క్వార్టర్లలో విద్యు త్‌ సరఫరా నిలిపివేస్తున్నారని, దీంతో కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌ పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్‌ స్టాళ్ల కేటాయింపులో అనర్హులకు అవకా శం కల్పించారని, పారదర్శకంగా లబ్ధిదారులను ఎం పిక చేయాలన్నారు. ప్రజలు జ్వరాల బారిన పడు తున్నప్పటికీ పలు వార్డుల్లో ఫాగింగ్‌ చేయలేదని వైస్‌చైర్మన్‌ ప్రశ్నించారు. వెంటనే వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. కాల్‌టెక్స్‌ ఏరియాలోని రైల్వే కాలనీలో ఇండ్లలోకి వర్షం నీరు చేరుతుందని, శాశ్వత పరిష్కారం చూపాలని కౌన్సిలర్లు చంద్రశే ఖర్‌, నెల్లి శ్రీలతలు పేర్కొన్నారు. అన్ని వార్డుల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, నివారణకు చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. వన మహోత్సవంలో కోట్ల రూపాయలతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారే తప్ప సంరక్షణ చర్యలు తీసుకోలేదని, నిధులు వృథాగా పోతు న్నాయని చైర్‌పర్సన్‌ను కౌన్సిలర్‌ రాములునాయక్‌ నిలదీశారు.

కౌన్సిల్‌ సభ్యుల ఆమోదంతో పలు తీర్మానాలను ఆమోదించారు. వినాయక చవితి, బతుకమ్మ పం డుగల నేపథ్యంలో లైటింగ్‌ ఏర్పాటుకు రూ.లక్ష, వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాటుకు రూ.లక్ష, మెయిన్‌రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చ డానికి రూ.2 లక్షలు, పలు వార్డుల్లో వివిధ అభి వృద్ధి పనులకు తీర్మానం చేశారు. సింగరేణి కళా వేదిక, కాల్‌టెక్స్‌ ఏరియాల్లో స్ర్టీట్‌ వెండర్ల కోసం నిర్మించిన షాపులు కేటాయించేందుకు తీర్మానిం చారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ పట్ట ణాభివృద్ధికి అధికారులు, పాలకవర్గం సమన్వ యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కలె క్టర్‌ను చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు సన్మానించారు. కమి షనర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

చిన్నారితో సమావేశానికి

మున్సిపల్‌ సమావేశా నికి 30వ వార్డుకు చెందిన కౌన్సిలర్‌ భరద్వాజ్‌సుకేశిని ఏడాదిన్నర వయస్సున్న చిన్నా రితో సమావేశానికి వచ్చారు.

Updated Date - Aug 30 , 2024 | 10:36 PM