అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
ABN , Publish Date - Sep 30 , 2024 | 10:24 PM
ప్రజలకు అందు బాటులో ఉండి అంకితభావంతో విధులు నిర్వర్తిం చాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కోటపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీచేశారు. ప్రాణహిత సరిహద్దు గ్రామాలు, కేసుల నమోదు, మావోయిస్టుల ప్రాబల్యం, తదితర అంశాలను తెలుసుకున్నారు.
కోటపల్లి, సెప్టెంబరు 30: ప్రజలకు అందు బాటులో ఉండి అంకితభావంతో విధులు నిర్వర్తిం చాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కోటపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీచేశారు. ప్రాణహిత సరిహద్దు గ్రామాలు, కేసుల నమోదు, మావోయిస్టుల ప్రాబల్యం, తదితర అంశాలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ మావోయి స్టు ప్రాబల్య గ్రామాల్లో తనిఖీలు, నాకా బందీలు, ఏరియా డామినేషన్, కమ్యూనిటీ కాంటాక్టు కార్య క్రమాలు నిర్వహించాలని, నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించి జాబ్ మేళాలు, మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా దిశ నిర్ధేశం చేయాలన్నారు. స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మెలగాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధు లు నిర్వర్తించాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల కు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి సీపీ మొక్క నాటారు. రూరల్ సీఐ సుధాకర్, కోటపల్లి ఎస్‌ఐ రాజేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో 6903 కేసుల పరిష్కారం
మంచిర్యాల అర్బన్: రాజీమార్గమే రాజ మార్గమని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించిన లోక్ అదాలత్‌లో కమిషనరేట్ పరిధిలో 6903 కేసులు పరిష్కారమయ్యాయని, 66 సైబర్ కేసుల్లో రూ.17,01,816 నగదును రికవరీ చేశామని పేర్కొ న్నారు. రికవరీ చేసిన నగదును బాధితులకు ఇప్పిం చేందుకు కోర్టు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ అధికారులకు పంపినట్లు ఆయన తెలిపారు. నింది తులు కక్షిదారులకు సమాచారం అందించి, అవ గాహన కల్పించి కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులను సీపీ అభినందించారు.