పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Sep 27 , 2024 | 10:46 PM
జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌లో జిల్లా వ్యవసాయాధికారి కల్పన, జల్లా యువజన క్రీడ అధికారి కీర్తి రాజ్‌వీరు, లయన్స్ క్లబ్ ప్రతినిధులతో కలిసి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పోస్టర్లను విడుదల చేశారు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 27: జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌లో జిల్లా వ్యవసాయాధికారి కల్పన, జల్లా యువజన క్రీడ అధికారి కీర్తి రాజ్‌వీరు, లయన్స్ క్లబ్ ప్రతినిధులతో కలిసి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పోస్టర్లను విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అటవీ శాతం అధికంగా ఉందని, వివిధ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. కవ్వాల టైగర్ రిజర్వు, ఎల్లంపల్లిప్రాజెక్టు, శివ్వారం మొసళ్ల అభయారణ్యం, గాంధారి ఖిల్లా, జలపాతాలు ఉన్నాయన్నారు. పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఉమెన్ ఎంపరవ్‌మెంట్ అధికారి అనిత, లయన్స్ క్లబ్ సభ్యులు సత్యనారాయణ, రాజన్న, ఆదర్శవర్దన్ రాజు, అధికారులు పాల్గొన్నారు.
కవ్వాల అభయారణ్యం పరిధిలో నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి
కవ్వాల్ అభయారణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ, అటవీ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా అటవీ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్, అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అభయారణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ, అటవీ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో నిషేధిత, అక్రమ వ్యాపారాలు, అక్రమ నిర్మాణాలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు.