Share News

ముదిరాజ్‌ సంఘం బలోపేతానికి కృషి చేయాలి

ABN , Publish Date - Nov 21 , 2024 | 10:21 PM

ముదిరాజ్‌ సంఘం బలోపేతానికి సభ్యులు కృషి చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, యువజన అధ్యక్షుడు గరిగె సుమన్‌ సూచించారు. దండేపల్లిలో గురువారం మత్స్యకారుల దినోత్సవ, తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు.

ముదిరాజ్‌ సంఘం బలోపేతానికి కృషి చేయాలి

దండేపల్లి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ముదిరాజ్‌ సంఘం బలోపేతానికి సభ్యులు కృషి చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, యువజన అధ్యక్షుడు గరిగె సుమన్‌ సూచించారు. దండేపల్లిలో గురువారం మత్స్యకారుల దినోత్సవ, తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. అధ్యక్షుడు మాట్లాడుతూ ముదిరాజ్‌లను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ముదిరాజ్‌ల ఐక్యతను చాటి చెప్పేందుకు కమిటీలను వేయాలన్నారు. తాండబోయిన శ్రీకాంత్‌, కంకణాల సతీష్‌, మేకల తిరుపతి, మండల నాయకులు పాల్గొన్నారు.

చెన్నూరు, (ఆంధ్రజ్యోతి): పట్టణంలో గురువారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాధనబోయిన కృష్ణ మాట్లాడుతూ మత్స్యకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నాయకులు రమేష్‌, నాగరాజు, మధుకర్‌, మొండి, శ్రీనివాస్‌, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

భీమారం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ప్రపంచ మత్య్సకారుల దినోత్సవాన్ని ముదిరాజ్‌ మత్స్యకారుల సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు పెండ్యాల మధు జెండాను ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టి సంబరాలు చేసుకున్నారు. రాకేష్‌, రాజన్న, మల్లేష్‌, సారయ్య, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 10:21 PM