mla vinod నష్టపరిహారం అందించేందుకు కృషి
ABN , Publish Date - Sep 08 , 2024 | 10:29 PM
ప్రాణహిత నది బ్యాక్ వాటర్‌తో మండలం లో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ హామీ ఇచ్చారు. ఆదివారం సుంపుటం, వేమనపల్లి, ముల్కలపేట, రాచర్ల గ్రామాల్లో ప్రాణహిత నది బ్యాక్ వాటర్‌తో నష్టపోయిన పత్తి పంటలను పరిశీలిం చారు.
వేమనపల్లి, సెప్టెంబరు 8: ప్రాణహిత నది బ్యాక్ వాటర్‌తో మండలం లో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ హామీ ఇచ్చారు. ఆదివారం సుంపుటం, వేమనపల్లి, ముల్కలపేట, రాచర్ల గ్రామాల్లో ప్రాణహిత నది బ్యాక్ వాటర్‌తో నష్టపోయిన పత్తి పంటలను పరిశీలిం చారు. రైతులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగడంతో నష్టపోయిన రైతులందరికి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. రైతులు ఈ విషయంలో అధైర్య పడవద్దని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచిం చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వైద్య సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నీల్వాయిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మండలంలోని 18 మందికి మంజూరైన కల్యాణలక్ష్మీ చెక్కులను ఆర్డీవో హరికృష్ణతో కలిసి అందజేశారు. అనంతరం ఇటీవల కురిసిన వర్షాలకు మామడకు వెళ్లే రోడ్డు మధ్యలో ఉన్న తాత్కాలిక వం తెన కొట్టుకుపోవడంతో పరిశీలించారు. శాశ్వత వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మాజీ జెడ్పీటీసీ సంతోష్‌కు మార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ సాబీర్ ఆలీ, నీల్వాయి మాజీ సర్పంచు గాలి మధు, కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు.