Share News

నేతకానీలకు హక్కులు కల్పించేందుకు కృషి చేస్తా

ABN , Publish Date - Nov 23 , 2024 | 10:37 PM

నేతకానీలకు జనాభా దామాషా ప్రకారంగా హక్కులు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అన్నారు. శనివారం వైశ్యభవన్‌లో ఏర్పాటు చేసిన నేతకాని ఆత్మగౌరవ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. అన్ని కులాల సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

నేతకానీలకు హక్కులు కల్పించేందుకు కృషి చేస్తా

మంచిర్యాల అర్బన్‌, నవంబరు23 (ఆంధ్రజ్యోతి): నేతకానీలకు జనాభా దామాషా ప్రకారంగా హక్కులు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అన్నారు. శనివారం వైశ్యభవన్‌లో ఏర్పాటు చేసిన నేతకాని ఆత్మగౌరవ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. అన్ని కులాల సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నేతకానిల డిమాండ్లను, కార్పొరేషన్‌ ఏర్పాటు, సామాజిక భవనం ఏర్పాటు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్‌ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతకాని కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని, నామినేటెడ్‌ పదవులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, హామీలను నెరవేర్చాలని కోరారు. తమ హక్కుల సాధన కోసం హైదరాబాద్‌లో జరిగే సింహగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, నాయకులు దుర్గం నర్సయ్య, బోర్లకుంట దీపక్‌కుమార్‌, సెగ్గెం రాజేష్‌, గోళ్ల రాజమల్లు, తదితరులు పాల్గొన్నారు.

నేతకాని మహర్‌ జిల్లా అధ్యక్షుడిగా రాంబాబు

మందమర్రిటౌన్‌, (ఆంధ్రజ్యోతి) : నేతకాని మహర్‌ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా మందమర్రికిచెందిన చునార్కర్‌ రాంబాబు నియమితులయ్యారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్‌లో జరిగిన నేతకాని ఆత్మగౌరవ సభలో రాంబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రాంబాబును శాలువాలతో సన్మానించారు. నేతకానిలందర్ని సంఘటితం చేసి సంఘం అభివృద్ధి చేస్తానని రాంబాబు తెలిపారు.

Updated Date - Nov 23 , 2024 | 10:37 PM