Share News

ఓటరు జాబితాలో తప్పొప్పులు సరిచూసుకోవాలి

ABN , Publish Date - Sep 13 , 2024 | 10:23 PM

ప్రజలు ఓటరు జాబితాలో ఉన్న తప్పొప్పులను సరి చూసుకోవాలని డీఎల్‌పీవో ధర్మారాణి పేర్కొన్నారు. శుక్రవారం ఇందారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీఓ శ్రీపతి బాపు రావుతో కలిసి రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితాను ప్రదర్శించారు.

ఓటరు జాబితాలో తప్పొప్పులు సరిచూసుకోవాలి

జైపూర్‌, సెప్టెంబరు 13 : ప్రజలు ఓటరు జాబితాలో ఉన్న తప్పొప్పులను సరి చూసుకోవాలని డీఎల్‌పీవో ధర్మారాణి పేర్కొన్నారు. శుక్రవారం ఇందారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీఓ శ్రీపతి బాపు రావుతో కలిసి రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితాను ప్రదర్శించారు. ఆమె మాట్లాడుతూ ప్రజలు ఓటరు జాబితాలో తమ పేర్లు చూసుకొని తప్పులు ఉంటే సరి చేసుకోవాలని సూచిం చారు. కార్యదర్శి సుమన్‌ పాల్గొన్నారు.

తాండూర్‌: ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరా లు, సలహాలు ఉంటే ఈ నెల 21 లోపు తెలియజేయా లని ఎంపీడీవో శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో కోరారు. శుక్ర వారం అన్ని గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ కార్యాల యంలో డ్రాఫ్ట్‌ ఓటరు లిస్టు ప్రచురించామన్నారు. ఈ నెల 28న ఫైనల్‌ ఓటరు జాబితా ప్రదర్శిస్తామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కార్యదర్శుల దృష్టికి తీసుకొని రావాలని సూచించారు.

కాసిపేట: గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను సత్యనారాయణ సింగ్‌ విడుదల చేశారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా 2024లో ఓటర్లను మెర్జ్‌ చేసిన అనంతరం జాబితాను విడుదల చేశామన్నారు. పంచాయతీల్లో జాబితాలు ప్రదర్శనకు ప్రదర్శిస్తున్నా మని ఎంపీడీవో పేర్కొన్నారు. ఎంపీవో శేఖ్‌ సఫ్దర్‌అలీ, సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 10:23 PM