Share News

నిత్యావసర ధరలు తగ్గించాలి

ABN , Publish Date - Oct 05 , 2024 | 10:17 PM

నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని శనివారం సీపీఐ పట్టణ సమితి నాయకులు కాంటా చౌరస్తా వద్ద రహదారిపై ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు వెంకటస్వామి, పట్టణ కార్యదర్శి ఆవిడపు రాజమౌళిలు మాట్లాడుతూ ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లితోపాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.

నిత్యావసర ధరలు తగ్గించాలి

బెల్లంపల్లి, అక్టోబరు 5: నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని శనివారం సీపీఐ పట్టణ సమితి నాయకులు కాంటా చౌరస్తా వద్ద రహదారిపై ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు వెంకటస్వామి, పట్టణ కార్యదర్శి ఆవిడపు రాజమౌళిలు మాట్లాడుతూ ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లితోపాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పిన ప్రధాని మోదీ ధరలను నియంత్రించలేదన్నారు. దేశంలో ఉల్లి, వెల్లుల్లి కొరత లేకున్నా దళారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెరగడానికి కారణమవుతున్నారన్నారు.

దళారులు, బ్లాక్‌మార్కెట్‌ దారులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు వారికి కొమ్ము కాస్తున్నాయన్నారు. ఇప్పటికైనా నిత్యావసరాల ధరలను తగ్గించకపోతే ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. నాయకులు చిప్ప నర్సయ్య, బొల్లం పూర్ణిమ, లక్ష్మీనారాయణ, బియ్యాల ఉపేందర్‌, రాజేష్‌, గుండ చంద్రమాణిక్యం, బాపు, అమృత, రాజం, పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2024 | 10:17 PM