Share News

ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి

ABN , Publish Date - Oct 21 , 2024 | 10:47 PM

వచ్చే ఏడాది జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్‌ కోరారు. నస్పూర్‌, తీగల్‌పహాడ్‌, సీతారాంపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలు, కస్తూర్భా విద్యాలయంలో సోమవారం ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను ఉపాధ్యాయులకు అందించారు.

ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి

నస్పూర్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : వచ్చే ఏడాది జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్‌ కోరారు. నస్పూర్‌, తీగల్‌పహాడ్‌, సీతారాంపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలు, కస్తూర్భా విద్యాలయంలో సోమవారం ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను ఉపాధ్యాయులకు అందించారు. రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపాధ్యాయులందరూ తప్పని సరిగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.

పీఆర్సీ, డీఏలు, పెండింగ్‌ బిల్లులు వెంటనే మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చెప్పాలన్నారు. తపస్‌ మండల అద్యక్షుడు వెంకటరమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 10:47 PM