Share News

పట్టు పురుగుల సాగుతో రైతులకు లాభం

ABN , Publish Date - Sep 30 , 2024 | 10:20 PM

రైతులు పట్టు పురుగులు సాగు చేయడం ద్వారా లబ్ధి చేకూరుతుందని, అధిక లాభాలు గడించవచ్చని రాష్ట్ర పట్టు పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లత, సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు సీనియర్‌ సైంటిస్టు వినోద్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు.

పట్టు పురుగుల సాగుతో రైతులకు లాభం

జన్నారం, సెప్టెంబరు 30: రైతులు పట్టు పురుగులు సాగు చేయడం ద్వారా లబ్ధి చేకూరుతుందని, అధిక లాభాలు గడించవచ్చని రాష్ట్ర పట్టు పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లత, సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు సీనియర్‌ సైంటిస్టు వినోద్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. సోమవారం పొనకల్‌ రైతు వేదికలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా, జగిత్యాల జిల్లాకు చెందిన రైతులకు పట్టు సాగుపై అవగాహన కల్పించారు.

పట్టు సాగు ద్వారా వచ్చే లాభా లు, పంట పండించే విధానం, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, రైతు పెట్టుబడి తదితర అంశాల గురించి వివరించారు. రైతులు 2 ఎకరాల్లో పట్టు సాగు చేయడం ద్వారా రూ. 7.50 లక్షలు ఖర్చు వస్తుందని, ఇందులో ప్రభుత్వం నుంచి రూ. 3.75 లక్షల సబ్సిడీ ఇస్తుందన్నారు. ఎకరం మల్బరీ తోట ద్వారా ఆరుగురు వ్యక్తులకు సంవత్సరం పొడవునా ఉపాధి దొరకుతుం దన్నారు. డీఎహెచ్‌ఎస్‌వో అనిత, సెంట్రల్‌ స్కిల్‌ బోర్డ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ రాఘవేంద్ర, అసిస్టెంట్‌ సెరీ కల్చర్‌డైరెక్టర్‌ పార్వతి, సురేందర్‌ ,రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2024 | 10:20 PM