ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష
ABN , Publish Date - Oct 29 , 2024 | 10:33 PM
పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మంగళవారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో ఫీజు దీక్ష చేపట్టారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, అభినవ్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో రూ. 8300 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉందని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మంగళవారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో ఫీజు దీక్ష చేపట్టారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, అభినవ్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో రూ. 8300 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉందని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారన్నారు. దీక్షకు ప్రైవేటు కళాశాలల యజమానులు మద్దతు తెలిపారు. నాయకులు సతీష్, రాంచరణ్, ఆకాంక్ష,హరిప్రియ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.