క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది
ABN , Publish Date - Dec 18 , 2024 | 10:29 PM
క్రీడలతో క్రీడాకారుల మధ్య స్నేహభావం పెంపొందుతుందని జిల్లా కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న జిల్లాస్థాయి క్రీడా పోటీలను అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి కీర్తి రాజ్‌వీరు, డీపీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో గణపతితో కలిసి పోటీలను పరిశీలించారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): క్రీడలతో క్రీడాకారుల మధ్య స్నేహభావం పెంపొందుతుందని జిల్లా కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న జిల్లాస్థాయి క్రీడా పోటీలను అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి కీర్తి రాజ్‌వీరు, డీపీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో గణపతితో కలిసి పోటీలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్రీడారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యతను ప్రోత్సహిస్తోందన్నారు. ఇందులో భాగంగా సీఎం కప్ 2024 పోటీలను జిల్లాలో విజయవంతం చేసేదిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.
ఈనెల 27 నుంచి జనవరి 2 వరకు రాష్ట్రస్థాయిలో జరుగనున్న పోటీలలో క్రీడాకారులు రాణించి జిల్లాకు పేరు తీసుకరావాలన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఉషోదయ ఉన్నత పాఠశాలలో ఖోఖో, రెజ్లింగ్, బేస్‌బాల్, చెస్, సెవన్‌హిల్స్ పాఠశాలలో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ పోటీలు జరుగుతాయన్నారు. 20న కరాటే, జూడో, హ్యాండ్‌బాల్, ఉఘా, 21న హైటెక్ సిటి క్లబ్‌లో బ్యాడ్మింటిన్, స్విమ్మింగ్, అత్యాపత్యా, టేబుల్ టెన్చిస్, ఇతర క్రీడలు నిర్వహిస్తామన్నారు. క్రీడల పోటీలో గెలుపు ఓటమి సమానంగా తీసుకొని క్రీడాస్ఫూర్తిగా ముందుకు సాగాలన్నారు.