గణేష్ నిమజ్జనానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 10 , 2024 | 10:53 PM
గణేష్ నిమజ్జనానికి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని మున్సిపల్ చైర్‌ప ర్సన్ జక్కుల శ్వేత పేర్కొన్నారు. మంగళవారం నిమజ్జనం కోసం బెల్లంపల్లి పోచమ్మ చెరువు వద్ద ఏర్పాట్లను ఆర్డీవో హరికృష్ణ, ఏసీపీ రవికుమార్‌లతో కలిసి పరిశీలించారు. వారు మాట్లాడుతూ చెరువు లో నిమజ్జనం కోసం పూడికతీత చేపట్టామన్నారు.
బెల్లంపల్లి, సెప్టెంబరు 10: గణేష్ నిమజ్జనానికి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని మున్సిపల్ చైర్‌ప ర్సన్ జక్కుల శ్వేత పేర్కొన్నారు. మంగళవారం నిమజ్జనం కోసం బెల్లంపల్లి పోచమ్మ చెరువు వద్ద ఏర్పాట్లను ఆర్డీవో హరికృష్ణ, ఏసీపీ రవికుమార్‌లతో కలిసి పరిశీలించారు. వారు మాట్లాడుతూ చెరువు లో నిమజ్జనం కోసం పూడికతీత చేపట్టామన్నారు. చెరువు చుట్టు పక్కల ప్రాంతాలను శుభ్రం చేయిం చామని, గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాం తంగా జరుపుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజున పోలీసు నిబంధనలు పాటించాలని పేర్కొ న్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు అస్మాషేక్, రాములునాయక్, సీఐ పాల్గొన్నారు.
దండేపల్లి: గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతా వరణంలో నిర్వహించుకోవాలని తహసీల్దార్ సంధ్య రాణి, సీఐ అల్లం నరేందర్, ఎంపీడీవో ప్రసాద్‌లు సూచించారు. గూడెం, ద్వారక గోదావరినది వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. వారు మాట్లాడు తూ గూడెం గోదావరి నదిలో నీటిమట్టం ఎక్కువ ఉన్నందున భక్తులు నదిలోకి వెళ్లకుండా ఏర్పాటు చేయాలన్నారు. గూడెం చెక్‌పోస్టు నుంచి గోదావరి తీరం వరకు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలన్నా రు. గూడెం, ద్వారక వద్ద పటిష్టమైన పోలీసు బం దోబస్తు చేపడుతామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్‌చందు, మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, ఆర్‌జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, ఎస్సై ఉదయ్‌కిరణ్, శ్రీనివాస్, కట్కూరి రాజన్న ఉన్నారు.
తాండూర్: వినాయక నిమజ్జనంలో అపశ్రుతులు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు సీఐ కుమారస్వామి అన్నారు. తాండూరు పెద్ద చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. తగిన లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. అవాంఛనీ య సంఘటనలు జరుగకుండా పోలీస్ శాఖ సిద్ధం గా ఉందన్నారు. ఎస్సై కిరణ్‌కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు.