Share News

ఇష్టారీతిన హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ

ABN , Publish Date - Sep 27 , 2024 | 10:49 PM

జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, దాబాల్లో అపరిశుభ్రత నెలకొంటుంది. రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్ధాలతో వంటకాలు తయారు చేస్తు న్నారు. కుళ్లిన కూరగాయలు, మాంసం, నాణ్యత లేని పదార్ధాలు, కాలం చెల్లిన మసాలాలు వినియోగిస్తున్నారు.

ఇష్టారీతిన హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ

బెల్లంపల్లి, సెప్టెంబరు 27: జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, దాబాల్లో అపరిశుభ్రత నెలకొంటుంది. రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్ధాలతో వంటకాలు తయారు చేస్తు న్నారు. కుళ్లిన కూరగాయలు, మాంసం, నాణ్యత లేని పదార్ధాలు, కాలం చెల్లిన మసాలాలు వినియోగిస్తున్నారు. హోటళ్లు నిర్వాహకులు నిబం ధనలు పాటించకపోవడంతో ఆహార నాణ్యత ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు హోటళ్లను నామమాత్రంగా తనిఖీలు చేస్తుండడంతో హోటళ్ల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జిల్లా కేంద్రంతోపాటు పలు పట్టణాల్లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. నిర్వాహకులు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 20కి పైగా కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఆహార భద్రత అధికారులు తెలిపారు.

-జిల్లాలో ఇష్టారీతిన హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ

జిల్లా కేంద్రంతోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, లక్షెట్టిపేట, నస్పూర్‌, మందమర్రి, రామకృష్ణాపూర్‌ వంటి ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 1500లకు పైగా హోటళ్లు ఉన్నాయి. వీటిలో కొందరు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు బయట అందంగా అలంకరణ చేసి వంట గదుల్లో మాత్రం శుభ్రత పాటించడం లేదు. అపరిశుభ్రత వాతావరణంలో రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్ధాలతో వంటకాలు తయారు చేస్తున్నారు. అంతే కాకుండా చికెన్‌, మటన్‌, చేపలు నిల్వ ఉంచుతున్నారు. పలు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ఆహారం తయారు చేయడానికి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారు.

- పర్యవేక్షణ కొరవడడంతో ...

అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హోటళ్ళ నిర్వాహకులు ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారు. ఇటీవల హోటళ్లు, రెస్లారెంట్లు, దాబాల్లో తినే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇదే అదనుగా కొత్తకొత్త హోటళ్లు, రెస్టారెంట్లు దర్శనమిస్తున్నాయి. ప్రధాన చౌరస్తాల వద్ద ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బేకరీలు, మిర్చిబండ్లు, టిఫిన్‌ సెంటర్లు ఉన్నాయి. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల నుంచి ఎలాంటి లైసెన్సులు పొందకుండానే హోటళ్లు నిర్వహిస్తున్నారు. వంటకాల తయారీలో వాడే వస్తువులను మార్కెట్‌లో తక్కువ ధరలకు లబించే వాటిని కొనుగోలు చేస్తున్నారు. వంటకాల్లో వివిధ రంగులను ఉపయో గిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ఇష్టరీతిన హోటళ్లు నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాణ్యత పాటించాలి

-వాసురామ్‌ , జిల్లా ఆహార భద్రత అధికారి

హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. తనిఖీలు చేపట్టి నమూనాలను సేకరిస్తున్నాం. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై 20కి పైగా కేసులు నమోదు చేశాం. హోటల్లు, రెస్టారెంట్లు నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే ప్రజలు ఫిర్యాదు చేయాలి.

Updated Date - Sep 27 , 2024 | 10:49 PM