Share News

అవకాశం కల్పించరా...?

ABN , Publish Date - Oct 26 , 2024 | 11:34 PM

శిక్షణ పూర్తి చేసుకున్న అర్హత గల ఆర్ట్‌, క్రాఫ్ట్‌ అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాంలో రిక్రూట్‌మెంట్‌ జరగగా అప్పటి నుంచి దాదాపు 35 సంవత్సరాలుగా నియామకాలు జరగలేదు. డీఎస్సీ నియామకాల్లో పోస్టులు కేటాయించకపోవడంతో ఆ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు తీవ్ర నిరాశ నిస్ప్రహలకు గురవుతున్నారు.

అవకాశం కల్పించరా...?

మంచిర్యాల, ఆక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): శిక్షణ పూర్తి చేసుకున్న అర్హత గల ఆర్ట్‌, క్రాఫ్ట్‌ అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాంలో రిక్రూట్‌మెంట్‌ జరగగా అప్పటి నుంచి దాదాపు 35 సంవత్సరాలుగా నియామకాలు జరగలేదు. డీఎస్సీ నియామకాల్లో పోస్టులు కేటాయించకపోవడంతో ఆ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు తీవ్ర నిరాశ నిస్ప్రహలకు గురవుతున్నారు.

మూడు దశాబ్దాలకు పూర్వం ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్‌, లలితకళలు, మ్యూజిక్‌, టైల రింగ్‌, కుట్లు, అల్లికలు, మెకానిజం, ఎలక్ట్రీషియన్‌, తదితర నైపుణ్యతలను విద్యార్థులకు నేర్పేందుకు అర్హతగల టీచర్లను డీఎస్సీల ద్వారా నియమించేవారు. ఆయా కోర్సుల్లో చేరడం ద్వారా ఉన్నత చదువులు అభ్యసించ లేని పేద విద్యార్థులు వృత్తిరీత్యా తమ కాళ్లపై తాము నిలబడే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆ పోస్టుల ప్రస్తా వనే లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాల్లో ప్రస్తుతం 1,733 పోస్టులు ఖాళీగా ఉండగా వారంతా డీఎస్సీపైనే ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనైనా తమకు అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు.

యేటా శిక్షణ తరగతులు

కనీస అర్హతలు ఉండి, పై విభాగాల్లో ట్రైనింగ్‌ చేయదలచిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వాలు క్రమం తప్పకుండా యేటా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా రెండు సంవత్సరాల పాటు లోయర్‌, హయ్యర్‌ పరీక్షలు నిర్వహించి ప్రతి వేసవిలో 45 రోజుల పాటు టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ సర్టిఫికేట్‌ కోర్స్‌ (టీటీసీ) నిర్వహిస్తున్నాయి. అనంతరం యోగ్యతా పరీక్షలు నిర్వ హించి అర్హులకు సర్టిఫికెట్లు కూడా అందజేస్తున్నాయి. సర్టిఫికెట్‌ ఉన్న వారు మాత్రమే డీఎస్సీలో ఉద్యోగాలకు అర్హులవుతారు. టీటీసీ శిక్షణ పొందిన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన ఐదు సెంటర్లు హైద్రాబాద్‌లోని గాంధీ భవన్‌ సమీపంలోని ఉర్దూ స్కూల్‌తోపాటు నిజామాబాద్‌, కరీం నగర్‌, వరంగల్‌, నల్గొండల్లో ఎస్సెస్సీ బోర్డు ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి సెంటర్‌ నుంచి యేటా 1500 నుంచి 2000 వరకు పట్టభద్రులు బయ టకు వస్తుండగా, మంచిర్యాలతో సహా ప్రతి జిల్లాలో కనీసం 6 వేల మంది వరకు శిక్షణ పొందిన అభ్యర్థులు ఉన్నారు. క్రమం తప్పకుండా శిక్షణ తరగతులు నిర్వహి స్తున్న ప్రభుత్వాలు ఆయా రంగాల్లో ప్రావీణ్యం సంపా దించిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించడం లేదు. డీఎస్సీల్లో పోస్టులు కేటాయించకపోవడంతో వారంతా నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు.

ఆందోళనబాటలో అభ్యర్థులు

తమ సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవ డంతో ఆందోళన బాట పట్టే యోచనలో ఉన్నారు. కలె క్టరేట్లలో నిర్వహించే గ్రీవెన్స్‌ సెల్‌లో వినతులు సమర్పి చండంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులను కలిసి డీఎస్సీలో అవకాశం కల్పించాలని వేడుకున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు వారంతా సన్నద్ధమవుతున్నారు. పోస్టులు కేటాయించాలని పలు మార్లు ధర్నాలు నిర్వహించారు.

నియామకాలు చేపట్టాలి....

రాజన్‌చంద్ర, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ నిరుద్యోగ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

డీఎస్సీల్లో ఖాళీగా ఉన్న ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ పోస్టులను భర్తీ చేయాలి. ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ పై విభాగాల్లో ఉద్యోగులను నియమించేలా చర్యలు చేప ట్టాలి. ప్రభుత్వపరంగా శిక్షణ పొందిన లక్షలాది మందికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధిలేక దుర్భర జీవితం గడపాల్సి వస్తోంది. యేటా ప్రభుత్వమే శిక్షణ తరగ తులు నిర్వహిస్తూ డీఎస్సీల్లో పోస్టులు కేటాయించక పోవడం సమంజసం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం డీఎస్సీలో పోస్టులు కేటాయించడంతోపాటు నిర్ణీత వయస్సులో సడలింపు కల్పించాలి.

Updated Date - Oct 26 , 2024 | 11:34 PM