Share News

సీఎం కప్‌ హ్యాండ్‌బాల్‌లో బంగారు పతకం

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:08 PM

సీఎం కప్‌ రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్‌ హ్యాండ్‌ బాల్‌ జిల్లా జట్టుకు సోమవారం మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 27 నుంచి 29 వరకు హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించారు.

సీఎం కప్‌ హ్యాండ్‌బాల్‌లో బంగారు పతకం

గర్మిళ్ల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సీఎం కప్‌ రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్‌ హ్యాండ్‌ బాల్‌ జిల్లా జట్టుకు సోమవారం మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ నెల 27 నుంచి 29 వరకు హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించారు. మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో కోచ్‌ అరవింద్‌ను, క్రీడాకా రులను అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్‌రావు, ట్రెజరర్‌ రమేష్‌ రెడ్డిలు స్వాగతం పలికి సన్మానించారు. డీవైఎస్‌వో కీర్తి రాజ్‌వీరు, పిన్నింటి రఘునాధ్‌రెడ్డి, రమేష్‌, పనిరాజా, రామయ్య, కళ్యాణ్‌, సాయి, శృతి, వర్ష, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 11:08 PM